కేతకీ  సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు షురూ

కేతకీ  సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు షురూ

ఝరాసంఘం, వెలుగు:  సంగారెడ్డి జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన కేతకీ సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం శిఖర పూజతో ప్రారంభమయ్యాయి. శివరాత్రిని పురస్కరించుకొని తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. మన రాష్ట్రంతో పాటు కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివస్తారు.

పాలకమండలి లేకుండానే ఉత్సవాలు నిర్వహించడానికి ఆలయ అధికారులు సిద్ధమయ్యారు. జాతర ఏర్పాట్లకుప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఆర్టీసీ జహీరాబాద్ నుంచి ప్రతి15 నిమిషాలకు ఒక బస్సును తిప్పనున్నారు.